మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణ సంస్థ డిఎస్‌ఎన్ ఫిల్మ్ ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆన్యూవల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2022లో ఐదు అవార్డులు గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో డిఎస్‌ఎన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ, ఎండి, అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డ్ గ్రహీత దూలం సత్యనారాయణ ఈ అవార్డులను అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోసం తాము రూపొందించిన చిత్రానికి అవార్డులు ప్రకటించిన జ్యూరీ, పీఆర్సీఐకి దూలం సత్యనారాయణ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. డిఎస్‌ఎన్ ఫిలిమ్స్ సాధిస్తున్న విజయాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అందించిన మద్దతు, ప్రోత్సాహమే కారణమని దూలం సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ బిడ్డగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేసే పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ రూపొందించిన వీడియోలతో తెలంగాణలో ఉన్న పర్యాటక, ఇతర అంశాలు దేశం దృష్టిని ఆకర్షించినందుకు గర్వంగా ఉందన్నారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, సహకరించిన అధికారులకు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
డిఎస్‌ఎన్ ఫిలిమ్స్ గెలుచుకున్న అవార్డులు
1.క్రిస్టల్ అవార్డు – కళలు, సంస్కృతి, క్రీడల ప్రచారం : బుద్ధవనం (ఆధ్యాత్మిక పర్యాటక చిత్రం), 2. గోల్డ్ అవార్డు – విజనరీ లీడర్ షిప్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్: సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రగతిశీల తెలంగాణ, 3. గోల్డ్ అవార్డు – ట్రావెల్, లీజర్ ,హాస్పిటాలిటీ క్యాంపెయిన్ : తెలంగాణ టూరిజం సోమశిల టూరిజం సర్క్యూట్, 4. గోల్డ్ అవార్డు – హెల్త్ కేర్ కమ్యూనికేషన్ ఫిలిమ్స్ : తెలంగాణలో కోవిడ్-19 అవగాహన ప్రచారం, 5. కాంస్య అవార్డు – ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిలిమ్స్: రైతు బంధు, రైతు బీమా