Monday, December 23, 2024

జాతీయ పక్షుల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రతి సంవత్సరం జనవరి 5వ తేదీని జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ అన్నారు. పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ ( EPTRI ) పక్షు జాతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై మంత్రి ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో పక్షులు పోషించే కీలక పాత్ర, అవి ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.

ఆ దిశగా అవగాహన పెంచడం కొరకు ఈ రోజును (జనవరి 5వ తేదీ) జరుపుతున్నామని మంత్రి అన్నారు. దీనికి సంబంధించిన అవగాహన, విజ్ఞాన పోస్టర్‌ను పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ సిద్ధం చెయ్యడం జరిగిందన్నారు. ఆ పోస్టర్‌ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా వుందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News