గోషామహల్: కోఠి ఉమెన్స్ కళాశాల చెట్లపై గత కొంత కాలంగా నివసిస్తున్న జాతీయ ప్రాణి నెమలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోఠి మహిళా కళాశాలలో చె ట్లపై గత కొంతకాలంగా నివసిస్తున్న నెమలి శుక్రవారం అర్థ్దరాత్రి సమయంలో ఎగురుకుంటూ మూసీ వైపు వెళ్తుండగా విద్యుత్ తీగలకు తగిలి కింద పడి అక్కడే మృతి చెందింది. ఆ సమయంలో అక్కడే విధి నిర్వహణలో సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ పోలీసులు కృష్ణ, శేషాద్రిలు నెమలి మృతి చెందడం గమనించి వెంటనే అఫ్జల్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పంచనామా నిర్వహించిన అనంతరం పెట్రో కార్‌లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యుత్ తీగలు తగిలి జాతీయ పక్షి నెమలి మృతి చెందడం పట్ల వన్య ప్రాణి ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నెమలిని సకాలంలో జంతు ప్రదర్శనశాలకు తరలించక పోవడంపై అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో జాతీయ పక్షి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -