Sunday, November 17, 2024

రాహుల్ ట్విటర్ ఫోటోపై స్పందించిన జాతీయ బాలల కమిషన్

- Advertisement -
- Advertisement -

National Children's Commission responds to Rahul's Twitter photo

ఢిల్లీ పోలీసులు, ట్విటర్‌కు నోటీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీ దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఫోటోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విటర్‌లో పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సిపిసిఆర్) స్పందించింది. ఢిల్లీ పోలీసులతోపాటు ట్విటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ ట్విట్ లైంగిక దాడుల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టాన్ని(పోక్సోను)ఉల్లంఘించిందని కమిషన్ గుర్తు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాంతో, ఆ ట్విట్‌ను తొలగించే దిశగా ట్విటర్ చర్యలు చేపట్టింది. ఆ ట్విట్ ఉన్న చోట ట్విటర్ నిబంధనలను ఇది ఉల్లంఘించిందంటూ ఓ సందేశం పోస్ట్ చేసింది.

గత ఆదివారం ఢిల్లీలోని ఓ శ్మశానవాటికలో 9 ఏళ్ల దళిత బాలికపై కొందరు దుండగులు లైంగికదాడికి పాల్పడి హత్యగావించినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాలిక కుటుంబాన్ని బుధవారం రాహుల్ పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులను పరామర్శించిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఆమె తల్లిదండ్రుల కన్నీళ్లు ఒకటే చెబుతున్నాయి. ఈ దేశపు కూతురికి న్యాయం జరగాలి. అందుకు నేను వారి వెంటే ఉంటాను. ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్లను’ అంటూ రాహుల్ ట్విట్ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News