శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తిరిగి ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన గతంలో ప్రకటించారు. అయితే ఆయన ఇప్పుడు మనస్సు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తాను గాంధార్ బల్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. గతంలో ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచి సిఎం అయ్యారు. 2009 నుంచి 2015 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే 2022 లో ఓడిపోయారు.
ఇదిలావుండగా జమ్మూకశ్మీర్ ఎన్నికలు మూడు విడతలలో జరుగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 4న ఎన్నికలు ఫలితాలు వెలువడతాయి. జమ్మూకశ్మీర్ లోని 90 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తొలగించాక జరిగే తొలి ఎన్నికలు ఇవే.