ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియాపై జాతీయ సదస్సు
మనతెలంగాణ/హైదరాబాద్ : విశ్వ విశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘డిజిటల్ ఇండియా కొవిడ్-19 దృష్ట్యా స్వయం -విశ్వాస భారతదేశాన్ని సాధించడానికి ఒక రోడ్ మ్యాప్’ అనే అంశంపై శుక్ర, శనివారాలలో రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పండితులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలను కలిసి సహకార చర్చలు జరపడానికి, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు భారతదేశం స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఎలా సహాయపడతాయనే దాని గురించి, వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని పంచుకోవడానికి ఈ సదస్సు ఉద్దేశించబడిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
భాతరదేశం,విదేశాల నుంచి బిజినెస్ స్కూల్స్, యూనివర్సిటీల ఫ్యాకల్టీ సభ్యులు, రీసెర్చ్ స్కాలర్లు, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు రెండు రోజుల జాతీయ సదస్సులో పాల్గొనడానికి, వివిధ ట్రాక్‌లలో పరిశోధన పత్రాలను సమర్పించడానికి నమోదు చేసుకున్నారని తెలిపారు.ఈ సందర్భంగా ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్-, విశ్వ విశ్వాని సంస్థల ఆధ్వర్యంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, భారత ప్రభుత్వ సహకారంతో 120కిపైగా సారాంశాలతో కూడిన సెమినార్ సంకలనాన్ని విడుదల చేయనున్నారు.