Sunday, November 24, 2024

లక్నోలో జరుగు జాతీయ మహాసభలు జయప్రదం చేయండి

- Advertisement -
- Advertisement -

బికెఎంయు జాతీయ ప్రధాన కార్యదర్శి నిర్మల్

హైదరాబాద్ : భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బికేఎంయు) అఖిలభారత మహాసభలు ఆగస్టు 2 నుండి 5 వరకు బీహార్ రాష్ట్రంలోని లక్నో నగరంలో జరుగుతాయని బికేఎంయు జాతీయ కార్యదర్శి ఎమ్మెస్ నిర్మల్ తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో నిర్మల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆయన తన ప్రసంగము కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు అనేక సమస్యలతో సతమవుతున్నరని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆకలి నిరుద్యోగం, నిరక్షరాస్యత పెరిగిపోయిందని అన్నారు. వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చినందున దేశంలో వ్యవసాయ కూలీలకు కొంత ఉపాధి దొరికిందని అన్నారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో అనేక అవరోధాలు కల్పించి ఆ చట్టాన్ని ఎత్తివేయాలని మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని రోజుకు 200 రోజులు పని కల్పిం చాలని రోజుకు 600 కూలి వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్మికులకు సమగ్ర చట్టం తీసుకువచ్చి దానిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుండి 5 వరకు లక్నోలో జరుగుతున్న బికేఎంయు జాతీయ మహాసభలలో ఈ అంశాలన్నిటినీ చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని నిర్మల్ తెలిపారు. తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాలమల్లేష్ ప్రసంగిస్తూ దళితులకు మూడెకరాల ప్రభుత్వ భూమి పంపిణీ చేస్తామని దళిత బంధు దళితులందరికీ అందిస్తామని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్స్ అందిస్తామని టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చెప్పి సక్రమంగా అమలు పరచడంలో విఫలమైందని విమర్శించారు.

రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, భూదాన, దేవాదాయ, పోడు భూములు, అన్యకాంతం అవుతున్నాయని వాటిని కాపాడడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు దౌర్జన్యం చేసి తొలగించి అక్రమ కేసులు జైలుకు తరలించడానికి వ్యవ సాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ప్రభుత్వ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు.

ఈ సమావేశాలకు బికేఎంయు రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య అధ్యక్షత వహించగా బి కే ఎం యు జాతీయ కార్యవర్గ సభ్యులు టి వెంకట్ రాములు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు సృజన్ కుమార్, వెంకన్న, వెంకటేశ్వర్లు, ఏసు, బొద్దుల జంగయ్య, అక్కంపల్లి బాబు తో పాటు వ్యవసాయ కార్మిక సంఘం వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు శ్రావణ్ కుమార్, నరసింహ, టి.శంకర్, రాజు, రమేష్ జనార్దన్, మాణిక్యం, రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా నాయకులు కే మహాలక్ష్మి, యాదమ్మ స్వరూప, తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం ఈ కింది తీర్మానాలు చేశారు. ఆగస్టు 15 వరకు వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం పూర్తి చేయాలి. వివిధ జిల్లాల జనరల్ బాడీ సమావేశాలు జరిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. లక్నోలో జరుగు జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News