Friday, January 10, 2025

జాతీయ సైబర్ క్రైమ్ ఆదేశాలు జారీ చేసినా పోలీసుల నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బక్క జడ్సన్ ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మడికొండ పోలీసులకు జాతీయ సైబర్ క్రైమ్ ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సిఈవో వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్ కాన్ సంస్థను బెంగళూరుకు తరలించేందుకు ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూకు కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ లేఖ రాశారంటూ తెలంగాణకు చెందిన ఓ మంత్రి తప్పుడు లేఖ సృష్టించారనే విషయంపై తాను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశాన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని మడికొండ పోలీసులకు ఆదేశాలు వచ్చిన వారు చర్యలు తీసుకోవడం లేదని,  పోలీసులను కలిసినా వారు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా పిసిసి అధికార ప్రతినిధి నిరంజన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాల్లో ఇంటర్వ్యూలు, న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కారణంతో మూడు రోజుల పాటు కెటిఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల టీ హబ్‌లో యువకులతో మంత్రి కెటిఆర్ సమావేశం అయ్యారని అందుకు సంబంధించిన ఫోటోలు వార్తా పత్రికల్లో ప్రచురణ అయినట్లు తెలిపారు. ప్రభుత్వ భవనమైన టిహబ్‌లో యువతతో కెటిఆర్ సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News