Monday, December 23, 2024

మాజీ ఇఎన్‌సిపై ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెం దిన కీలక అధికారులను గుచ్చిగుచ్చి ప్రశ్నలు వే సింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగం గా ఉన్న మేడిగడ్డ , అన్నారం , సుందిళ్ల బ్యారేజిలకు జరిగిన నష్టాలకు కారణాలను వెలికి తీసి వాటి సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు నిపుణుల కమిటి రెండవ పర్యాయం రాష్ట్రానికి వ చ్చింది. ఢిల్లీనుంచి బుధవారం మధ్యాహ్నం హై దరాబాద్‌కు చేరుకున్న కమిటి జలసౌధలోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో సమావే శం నిర్వహించింది. ఈ సమావేశంలో మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజిలకు సంబంధించిన ఇంజనీర్లను వేర్వేరుగా పిలిచి తగిన సమాచారం రాబట్టేందుకు ప్రశ్నలు వేసింది. సుమారు పుష్కరకాలం పాటు  నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా కీలక స్థానంలో ఉంటూ కాళేశ్వరం ,

మేడిగడ్డ బ్యారేజిలకు పునాదుల నుంచి పనులు పూర్తయ్యేదాక బాధ్యతలు నిర్వహించి ఇటీవలే ఈఎన్సీ స్థానానికి రాజీనామ చేసి ఉద్యోగ విరమణ చేసిన మురళీధర్‌ను కూడా కమిటీ సమావేశానికి పిలిపించింది. ఈ భేటీలో మురళీధర్ నుంచి ప్రాజెక్టు డిజైన్లు, ప్లానింగ్, ఆనకట్టల నిర్మాణం , పనులు నాణ్యత, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇచ్చిన నివేదికలు తదితర అంశాలపై సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జరిగిన లోపాలు , మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటుకు గుర్తించిన కారణాలు ,తదితర అంశాలపై కూడా ప్రశ్నించింది. ఇటివలే డ్యామ్ సేఫ్టి నిపుణుల కమిటీ గోదావరి నదివెంట పర్యటించి మేడిగడ్డ ,అన్నారం , సుందిళ్ల బ్యారేజిలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వచ్చింది. ఈ కమిటీ తాము మేడిగడ్డ కుంగుబాటుకు గల కారణాలు , లోపాలు తమ పరిశీలనలో దృష్టికి వచ్చిన ఇతర అంశాలను రిటైర్డు ఈఎన్సీ మురళీధర్ ద్వారా క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేసింది.

మరికొందరు ఇంజనీర్లను కూడా ఇవే అంశాలపై ప్రశ్చించి వారి నుంచి కూడా తగిన అధీకృత సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేసింది. సీడబ్యుసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో వచ్చిన డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటి మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. సంబంధిత అధికారులతో విడివిడిగా సమావేశాలు సమీక్షలు నిర్వహించనుంది. నీటిపారుదల శాఖకు చెందిన ఈఎన్సీ జనరల్, హైడ్రాలజి, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ విభాగాలకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News