Monday, December 23, 2024

నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని, దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేటాయించాలన్నారు.

హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్సటైల్ పార్క్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులివ్వాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లో సిసిఐ రీ ఓపెన్ చేయాలని, డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలన్నారు. చేనేత రంగానికి జిఎస్‌టి మినహాయించాలన్నారు. ఐటిఐఆర్ లేదా సమాప ప్రాజెక్టు ఇవ్వాలన్నారు. జహీరాబాద్ నిమ్జ్‌కు కూడా నిధులు కేటాయించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News