Monday, December 23, 2024

దళిత సంక్షేమంతోనే దేశాభివృద్ధి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: దళిత సంక్షేమంతోనే దేశాభివృద్ధి అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ం లో నేరడుగొమ్ము మండలానికి చెందిన ఎస్సీ కార్పొరేషన్ ద్వార మ ంజూరైన 6మంది రూ.3లక్షల చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వలస ఆపిన దళితబం ధు, దళిత కుటుంబాల్లో సరికొత్త కాంతులు వేలాగడం జరిగిందని ఆ యన అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు రూపం కేసీఆర్ అని ఆయన అన్నారు.

75 ఏండ్ల స్వాతంత్య్రంలో దళితులకు ఒరిగింది. శూన్యం అని ఆ యన తెలిపారు. దళిత సంక్షేమంతోనే దేశాభివృద్ధి అని ఆయన అన్నారు. తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల సంక్షేమం అని ఆయన అ న్నా రు.దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అ న్నా రు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ము ఖ్య మంత్రి కెసిఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు. నేడు దళిత బంధు ప థ కంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులు గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. బిఆర్‌ఎస్‌తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని అని ఆయన అన్నారు.

దళితుల జీవితాల్లో వెలుగులు ని ంపాలనే సంకల్పంతో తెలంగాణ దళిత బంధు పథకం అమలు చే యడం జరిగింది అని ఆయన అన్నారు.భారతావనిలో దళిత వాడలు ఇ ంకా అలాగే ఉన్నాయని, అయితే వారి జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బడుగుబలహీన వర్గాల సంక్షేమం కో సం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని ఆయన చెప్పారు. డా.బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోకసాని తిరపతయ్య, పిఏసిఎస్ చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, ముత్యాలమ్మరాములు, పల్స వెంకటయ్య, వాడిత్య బాలు, కుంభం నరేష్, ఎంపీడీఓ  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News