Monday, December 23, 2024

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ఈ నెల 20 వ తేదిన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ నులిపురుగల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు గల వారికి అల్బేండోజల్ 400 ఎంజి మాత్రలను నులిపురుగుల నివారణ కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.

అంగన్‌వాడి కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు మాత్రలు అందించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News