Monday, December 23, 2024

ఎంపి సంతోష్ పిలుపునకు అపూర్వ స్పందన

- Advertisement -
- Advertisement -

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటిన డాక్టర్లు, వైద్య, వైద్య విద్యార్థులు, సిబ్బంది


మన తెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భా గంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు వాటిని సామాజిక మాద్యమాలలో పెట్టారు. తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌ న్సిల్ ఆధ్వర్యంలో 14 దంత వైద్య కళాశాల (గవర్నమెంట్ డెంటల్ కాలేజీ, హైదరాబాద్, ఎమ్.ఎన్.ఆర్ డెంటల్ కాలేజీ, సంగారెడ్డి, మల్లారెడ్డి డెంటల్ కాలేజీ , హైదరాబాద్, ఆర్మీ డెంటల్ కాలేజ్, సికింద్రాబాద్, శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్, మొయినాబాద్, జోగినపల్లి భాస్కరరావు ఇన్‌స్టిట్యూషన్స్, ఎస్.వి.ఆర్ డెంటల్ కా లేజ్, మహబూబ్‌నగర్, మల్లారెడ్డ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెం టల్ సైన్స్, పావీనియా డెంటల్ కాలేజ్, చైతన్యపురి, మేఘనా డెంటల్‌కాలేజ్, నిజామాబాద్, మమతా డెంటల్ కాలేజ్, ఖమ్మం, శ్రీసాయి డెంటల్ కాలేజ్, వి కారాబాద్, మమతా డెంటల్ కాలేజ్, బాచ్‌పల్లి, కామినేని డెంటల్ కాలేజ్, నార్కట్‌పల్లి)ల్లో డాక్టర్లు, సిబ్బం ది, వైద్య విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు.

వందలాది మంది డాక్టర్స్, నర్సులు, వైద్య విద్యార్థులు, సి బ్బంది స్వచ్చందంగా పాల్గొని మొక్కలు నాటడం తన కు చాలా ఆనందాన్ని ఇచ్చిందని, తాను ఇచ్చిన పిలు పు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

మొక్కలు నాటిన డాక్టర్ మార్కండేయులు

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు హరితబంధు పర్యావరణవేత్త జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కలు నాటే మహాయజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సామాన్యుల నుండి సెలబ్రెటీ ల వరకు అందరిని కదిలిస్తున్నదన్నారు. ఇంత మంచి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యులను చేసినందుకు ఎంపి సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ మార్కండేయు లు, వైద్య బృందం పాల్గొన్నారు.

ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది : డాక్టర్ అనూష

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తిరుమల నర్సింగ్ హోమ్ డాక్టర్ అనూష, డాక్టర్ మన్విత గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గ్రీన్ ఇండియాలో ప్రకృతి క్లబ్ ఏర్పాటు : గ్లేండలే ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు

జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని హైదరాబాద్ లోని సన్ సిటిలో గల గ్లేండలే ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రకృతి క్లబ్‌ను ఉపాధ్యాయుల సహకారంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ప్రకృతి క్లబ్ ను ప్రారంబించటానికి గల కారణం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి పొందిన స్ఫూర్తినేనని వివరించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మాట్లాడుతూ విద్యార్థులలో ప్రకృతి గురించి అవగాహన పెంచవలసిన అవసరం మనందరిపైన ఉందని ప్రకృతిని కాపాడితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాధిక, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో..

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు ఆయుష్ డాక్టర్స్. మెడికల్ సూ పరిటిండెంట్ డాక్టర్ బి.వెంకశ్వరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో డైటిషియన్ మేరీ సూర్యపోగు, డాక్టర్ వెంకన్న, శ్రీనివాస్, కెల్విన్ జన్సీరాం, శ్వేత అనిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News