Monday, December 23, 2024

కొత్త పార్లమెంట్‌పై జాతీయ జెండా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనంపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తోడుగా రాగా ఉప రాష్ట్రపతి కొలువుతీరిన కొత్త పార్లమెంట్ గజద్వారంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్ జరుగనున్న నేపథ్యంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చోటుచేసుకుంది. అంతకు ముందు పార్లమెంట్ ఆవరణలో ఉపరాష్ట్రపతికి, లోక్‌సభ స్పీకర్‌కు పార్లమెంట్ విధులలో ఉండే సిఆర్‌పిఎఫ్ బృందం వేర్వేరుగా గౌరవ వందనం పలికింది. జెండా ఎగురవేత తరువాత ఉప రాష్ట్రపతి కొద్ది సేపు విలేకరులతో మాట్లాడారు. భారత్ ఇప్పుడు గణనీయ మార్పుల పరిణామ క్రమపు చారిత్రక దశలో ఉందని తెలిపారు. దేశ శక్తియుక్తులు, సేవాభావన విశ్వవ్యాప్తం అవుతోందన్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీ, అర్జున్ రామ్ మేఘ్వాల్ , ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు హాజరయ్యారు. సిఆర్‌పిఎఫ్ దళం బ్యాండ్ మోగించిన తరువాత అక్కడికి వచ్చిన అతిధులతో ధన్‌కర్, బిర్లా కొద్ది సేపు ముచ్చటించారు. కొత్తగా నెలకొన్న పార్లమెంట్ భవనంపై అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేయడంతో ఇక ఐదురోజుల పార్లమెంట్ సెషన్ కొత్త భవనంలోనే సాగుతుందని నిర్థారణ అయింది. కాగా తమకు ఆహ్వానాలు ఆలస్యంగా అందాయని, తాము వేరే కార్యక్రమాలలో ఉన్నందున కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తనకు ఈ నెల 15న సాయంత్రం ఈ కార్యక్రమం గురించి ఆహ్వానంఅందిందని రాజ్యసభ సెక్రెటరీ జనరల్ మోడీకి లేఖ పంపించారు. సిడబ్లుసి సమావేశాలలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షులు అయిన ఖర్గే రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News