Monday, December 23, 2024

మహాత్మాగాంధీ కలలను కెసిఆర్ నిజం చేశారు: పోచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహాత్మాగాంధీ నాయకత్వంలో సాదించిన స్వాతంత్ర్య ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆసెంబ్లీ ఆవరణంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. యావత్ దేశ పౌరులందరికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాదిమంది జరుపుకుంటున్న పండుగ స్వాతంత్ర్య దినోత్సవం అని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. సిఎం కెసిఆర్ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని, మహాత్మాగాంధీ కలలను సిఎం కెసిఆర్ నిజం చేస్తున్నారని పోచారం కొనియాడారు. గాంధీ నాయకత్వంలో ఎంతో మంది పోరాడి శాంతియుతంగా స్వాతంత్య్రం సాదించారని,  దేశానికి స్వాతంత్య్రం పోరాడి తెచ్చుకున్నామని బ్రిటిష్ వారు ఇవ్వలేదని, ఇచ్చిన వారు గొప్పవారు కాదన్నారు.

Also Read: ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్

అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాదన కూడా కెసిఆర్ నాయకత్వంలో శాంతియుతంగా పోరాడి తెచ్చుకున్నామని,  ఈ ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. బాధ్యతయుతమైన పదవులలో ఉన్నవారు అన్ని వర్గాలను సమానంగా చూడాలని పోచారం పిలుపునిచ్చారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదే స్పూర్తితో రాష్ట్ర పరిపాలన చేస్తున్నారని,  స్వాతంత్ర్యం అందరి హక్కు అనే ఉద్యేశంతో పరిపాలన సాగుతోందని,  ధాన్యం ఉత్పత్తి, తలసరి ఆధాయం, విద్యుత్తు తో సహా అనేక రంగాలలో దేశంలో నెంబర్ వన్ గా ఉందని,  ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతబీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేవు అని చెప్పారు. గ్రామాల అభివృద్ధితో గ్రామ స్వరాజ్యం చూస్తున్నాం. శాంతిభద్రతలు‌, సమర్ధతకు మారుపేరు తెలంగాణ రాష్ట్ర పోలీసులు అని, అందరి కృషి తోనే ఈ అభివృద్ధి సాద్యమైందన్నారు.
ఈ ఫలాలు దేశంలోని అందరికీ అందాలని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 70 లక్షల టన్నుల నుండి 3 కోట్లకు పెరిగిందని మెచ్చుకొన్నారని పోచారం గుర్తు చేశారు.  ఒకరినొకరు విమర్శలు చేసుకుని సమయం వృథా చేయరాదని, కొంతమంది రాజకీయ నాయకులు అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, అందరం కలిసి రాష్ట్ర, దేశాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవలో మనమందరం పునరంకితం అవ్వాలని కోరారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News