Sunday, December 22, 2024

నేటి నుంచి జాతీయ ఉద్యాన ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

పీపుల్స్‌ప్లాజాలో ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం 16వ జాతీయ వ్యవసాయ ఉద్యాన ప్రదర్శనకు సిద్దమైంది.నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా గురువారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రదర్శనకు ప్రారంభోత్సవం చేయనున్నారు. సెప్టెంబర్ 2వరకూ మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు దేశం నలుమూలల నుంచి వచ్చిన నర్సరీల నిర్వహాకులు , సేంద్రీయ ఎరువులు , ఇతర పరికరాల సంస్థల ప్రతినిధులు, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

వందలాది రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకరణ మొక్కలు, మరగుజ్జు వృక్షాలు, తీగ జాతి మొక్కలు, వాటికి సంబంధించిన విత్తనాలు, దుంప మొక్కలు ఈ ప్రదర్శనలో కొలువుదీరుతున్నాయి. చూపరులను కట్టిపడేసేలా ఉన్న వివిధ రకాల అరుదైన జాతులకు చెందిన మొక్కలు ఈ సారి ప్రదర్శనకు హైలెట్‌గా మారనున్నాయని ప్రదర్శన నిర్వాహకులు ఖలీద్ ఆహ్మద్ జమీర్ వెల్లడించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 140కి పైగా స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. ప్రతిరోజు ఉదయం తొమ్మది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రదర్శన ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News