Tuesday, January 21, 2025

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరపాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వచ్చే నెల 7న జరగనున్న జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారకరామరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి కెటిఆర్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టెక్క్‌టైల్స్‌శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరిపేలా టెక్స్టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

నేతన్న చేయూత ,నేతన్నకు బీమా కార్యక్రమాన్ని మరింతగా విస్తృతపరచాలన్న కెటిఆర్, చేనేత మిత్ర పథకాన్ని మరింత సరళీకరించేందుకు ఉన్న పలు అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని నేతన్నల యోగక్షేమాల కోసం తాము కట్టుబడి ఉన్నామన్న కెటిఅర్, టెక్స్‌టైల్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు మరింతగా అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కెటిఆర్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మరింతగా నేతన్నల్లోకి తీసుకుపోయేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలతో పాటు, ఇతర కార్యక్రమాలను కలిపి చేనేత వారోత్సవాలను నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమాల్లో నేతన్నలతో పాటు, చేనేత ఉత్పత్తుల పట్ల ఆసక్తి చూపించే పలు సంస్థలు, వ్యక్తులను, రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో నేతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేతన్నల కోసం చేపట్టిన నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా వంటి కీలకమైన కార్యక్రమాలు పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న హ్యాండ్లూమ్ సొసైటీల పనితీరును మరింతగా మెరుగుపరిచి, అందులో సభ్యులుగా ఉన్న నేతన్నల స్థితిగతులను మెరుగుపరిచేందుకు టెక్స్‌టెల్ శాఖ ద్వారా తీసుకోవాల్సిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణ గురించి ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న వివిధ అంశాలను అవకాశాలను చర్చించారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేసిన శిల్పారామాల్లో టెక్స్‌టైల్ శాఖ తరపున మ్యూజియంలను ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటినుంచే ప్రారంభించాలని కెటిఆర్ అధికారులకు ఆదేశించారు. దీంతోపాటు ఆర్‌టిసి ,దక్షిణ మధ్య రైల్వేను సంప్రదించి హ్యాండ్లూమ్ ఉత్పత్తుల మార్కెటింగ్ కు అవసరమైన సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పనితీరు, అమలు, ఫలితాలు, అయా కార్యక్రమాల్లో అవసరమైన మార్పు చేర్పులకు సూచించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్థలతో ఒక అధ్యయనాన్ని చేయించాలని మంత్రి కెటిఆర్ టెక్స్‌టైల్స్ శాఖ అధికారులకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News