- Advertisement -
న్యూఢిల్లీ : ఈ నెల 7వ తేదీన (సోమవారం) జరిగే జాతీయ చేనేత దినోత్సవాలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. 1905 ఆగస్టు 7వ తేదీన ఆరంభం అయిన స్వదేశీ ఉద్యమ నేపథ్యంలో ఈ తేదీని ఖరారు చేశారు. దేశంలో దేశీయ చేనేతకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించేందుకు జాతీయ చేనేత ఉత్సవం తలపెట్టారు. ఇక్కడి ప్రగతిమైదాన్‌లోని నూతన భారత్ మండపంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ అతిధిగా హాజరవుతారని వెల్లడైంది.
- Advertisement -