- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డిజిపి రవిగుప్తాకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల వర్సిటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని రేణుశ్రీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. మీడియా కథనాలను ఆధారంగా సుమోటోగా స్వీకరించిన జాతీ య మానవ హక్కుల సంఘం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలనంటూ సిఎస్, డిజిపికి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 5న సంగారెడ్డి జిల్లా రుద్రాంలో ఉన్న గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ భవనంలోని ఐదో అంతస్తుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ప్రాణాలను తీసుకున్నది. ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..
- Advertisement -