న్యూఢిల్లీ : అంతర్గత భద్రతపై జాతీయ సమాచార నిధిని సిద్ధం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు. బాంబు పేలుళ్లు, ఉగ్రవాదానికి నిధులు, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాలు , హవాలా, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటివాటికి సంబంధించిన సమాచారంతో ఈ నిధిని తయారు చేస్తున్నట్టు తెలిపారు. కేసుల దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు పోలీసులకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) 13 వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా గురువారం అమిత్‌షా మాట్లాడారు. ఎన్‌ఐఎ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, ఇంటెలిజెన్స్‌బ్యూరో, ఈ నిధిని సిద్ధం చేసేందుకు కృషి చేస్తున్నాయన్నారు. గడచిన 13 ఏళ్లలో ఎన్‌ఐఎ దర్యాప్తు చేసిన ఉగ్రవాద సంబంధిత కేసుల్లో దోషిత్వ నిర్ధరణ రేటు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీరులో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చుతున్న సంఘటనల కేసుల దర్యాప్తులో ఎన్‌ఐఎ పనితీరును ప్రశంసించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాంటీ టెర్రర్ దర్యాప్తు సంస్థలకు ఎన్‌ఐఎ సహకరించాలని సూచించారు.
అంతర్గత భద్రతపై జాతీయ సమాచార నిధి : అమిత్‌షా
- Advertisement -
- Advertisement -
- Advertisement -