Tuesday, October 1, 2024

గచ్చిబౌలి చెరువులో నిథిమ్ క్యాంపస్ భవనాలు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (నిథిమ్) లో చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణం కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వేనెంబర్ 71లో 3 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువు విస్తరించి ఉంది. చెరువు ఎఫ్ టి ఎల్ తో కలుపుకొని దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కాగా ఈ చెరువు చుట్టూ నిథిమ్ క్యాంపస్ విస్తరించి ఉండగా గత కొన్ని సంవత్సరాల క్రితం నిథిమ్ యాజమాన్యం చెరువు బఫర్ జోన్ లో కొత్తగా భవన నిర్మాణం ప్రారంభించింది. చెరువును పూడ్చి భవన నిర్మాణం చేపట్టడంపై పలు స్వచ్ఛంద సంస్థలు, హెచ్ఆర్సిపిసి కోర్టును ఆశ్రయించాయి. దీంతో వివాదం కోర్టుకు చేరగా భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. కాగా కొన్ని రోజుల క్రితం హైకోర్టు సదరు భవనాన్ని తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో నిథిమ్ యాజమాన్యం భవనం కూల్చివేత పనులు మంగళవారం చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News