మన తెలంగాణ,సిటీబ్యూరో: జాతీయ జవహర్‌లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్‌కు జిల్లా విద్యార్థి అపూర్వ సహా, అమీర్‌పేట పాఠశాల సిస్టర్ నివేదిత 10వ తరగతి చదవుతున్కన విద్యార్థి అపూర్వ సహా సాప్ట్‌వేర్, యాప్ విభాగంలో టూ, డూ,లిస్ట్ రూపొందించిన పరికరానికి చోటు దక్కిందని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. రోహిణి తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ సైన్ గణిత పర్యావరణ ప్రదర్శన 2022, రాష్ట్రస్దాయిలో పోటీలకు జిల్లా విద్యార్థి ప్రదర్శన ఎంపికైంది.
ఈనెల 16న ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన రాష్ట్రస్దాయిలో ప్రదర్శనల్లో 33 జిల్లాల నుంచి ఆరు ఉప అంశాలలో దాదాపు 230మంది విద్యార్థులు పోటీ పడ్డారు. వీరిలో సాప్ట్‌వేర్, ఆప్ విభాగంగా జిలా సిస్టర్ నివేదిత పాఠశాల విద్యార్థి అపూర్వ సహా తయారు చేసిన డూ,డూ లిస్ట్ ప్రాజెక్టు రాష్ట్ర స్దాయిలో తృతీయ ప్రదర్శనగా నిలిచి జాతీయ స్దాయిలో పోటీలకు అవకాశం దక్కించుకుంది. ఈసందర్భంగా గైడ్ టీచర్ సుధా శ్రీనివాస్‌ను పలువురు అధికారులు అభినందించారు.