Monday, December 23, 2024

అదరగొట్టిన శివాని.. స్విమ్మింగ్‌లో రెండు స్వర్ణాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ జూనియర్ అక్వాటిక్స్ పోటీల్లో తెలంగాణకు చెందిన శివానీ కర్రా రెండు స్వర్ణాలు సాధించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా ఈ స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన యువ స్విమ్మర్లు పోటీ పడుతున్నారు. గురువారం జరిగిన బాలికల 200 మీటర్ల మెడ్లే విభాగంలో శివానీ పసిడి పతకం సాధించింది. తెలంగాణ యువ సంచలనం శివాని 2:43:23 నిమిషాల్లో గమ్యాన్ని చేరి స్వర్ణం దక్కించుకుంది.

మహారాష్ట్రకు చెందిన అనుష్కకు రజతం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లాస్యకు కాంస్యం లభించాయి. అంతేగాక బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో కూడా శివాని పసిడి పతకం సొంతం చేసుకుంది. అసాధారణ ప్రతిభతో అదరగొట్టిన శివాని 1:11:83 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. కాగా, ఈ పోటీల్లో తెలంగాణకు ఇది మూడో స్వర్ణం కావడం విశేషం. ఇంతకుముందు వ్రితి అగర్వాల్ కూడా ఫ్రీస్టయిల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News