Friday, November 22, 2024

జాతీయ లాక్‌డౌన్ ఉండకపోవచ్చు: పుతిన్

- Advertisement -
- Advertisement -
National lockdown may not be Says Vladimir Putin
 రష్యా అధ్యక్షుడు పుతిన్

మాస్కో: మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు వెళ్లాల్సి ఉండకపోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికంగా వ్యాప్తి అధికంగా ఉండేవారికి టీకాలను తప్పనిసరి చేయడం ద్వారా లాక్‌డౌన్ పరిస్థితి నుంచి బయటపడే వీలున్నదని ఆయన అన్నారు. ఇటీవల కరోనా కేసులు ఆ దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బుధవారం ఆ దేశంలో 21,042 కేసులు, 669 మరణాలు నమోదయ్యాయి. గత గురువారం నుంచి రష్యాలో రోజూ 20,000కుపైగా కేసులు, 600కుపైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన మొదటి దేశంగా పేరున్న రష్యాలో అనుకున్నస్థాయిలో టీకాల కార్యక్రమం జరగకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఆ దేశంలోని 15 శాతం మంది మాత్రమే కనీసం ఒక్క డోసు వేయించుకున్నారు. తాజాగా రష్యాలో మాస్కో, సెయింట్‌పీటర్స్‌బర్గ్‌తోపాటు 18 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ను వైరస్ వ్యాప్తికారక వర్గాలకు తప్పనిసరి చేశారు.

National lockdown may not be Says Vladimir Putin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News