Monday, December 23, 2024

ఆ విలువలను పరిరక్షించుకోవాలి: గోరెటి వెంకన్న

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ / నల్లగొండ న్యూస్: జాతీయ ఉద్యమకాలం నాటి విలువలను పరీరక్షించుకోవాలని ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న తెలిపారు. శుక్రవారం స్థానిక హౌజిల్ బోర్డులో క్యూర్ హోమియోపతి క్లీనిక్ ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోరెటి మాట్లాడారు. భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికి జాతీయ ఉద్యమ నేతలు పరస్పరం గౌరవించునేవారని చెప్పారు. నేడు కనీసం విమర్శలు వినేంత ఓపిక కూడా లేదని, జాతీయ ఉద్యమం నాటి పెట్టుబడి దారుల కన్న దేశహితం నేటి పాలకులకు లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. విధాన ప్రమేయ విమర్శలు, ప్రజాస్వామ్య విలువలను ఇముడింపజేయాలన్నారు.

చట్టసభలలో ప్రతిపక్షాలకు స్థానం లేకుండా పోయిందని, గుజరాతీ కుటుంబం, దేశ సమస్థ సంపదను కారు చౌకగా కొంటుందని విమర్శించారు. రాజ్యాంగ మౌళిక సుత్రాలకు కట్టుబడి దేశంలో పాలన కొనసాగాలని సూచించారు. స్పేయిన్ అంతర్‌ యుద్దం నాటి కాలం నాటి పరిస్థితిలు నేడు దేశంలో నెలకొన్నాయని వివరించారు. నేటి రచనలలో అసహజత్వం పెరిగిందని, సహజత్వమే కవిత్వమన్నారు. మానవ విలువలను మార్కెటు ద్వంసం చేశాయన్నారు. ప్రజా కవులు, ప్రగతిశీల, ప్రజస్వామ్య అభిప్రాయాలకు విలువనిరస్తారని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డాక్టర్ అంబటి సురేందర్‌రాజు, ధర్మపాల్ రెడ్డి, కేతనపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మారం శ్రీనివాస్, దాసి సుదర్శన్, ఎర్రయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News