Monday, December 23, 2024

ఎత్తొండ గ్రామవాసికి జాతీయ నంది అవార్డు

- Advertisement -
- Advertisement -

కోటగిరి: కోటగిరి మండల ఎత్తొండ గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ మఠం దీపక్ స్వామికి అరుదైన జాతీయ మహానంది అవార్డు పురస్కారం అందుకున్నారు. తెలుగు వెలుగు జాతీయ పరస్కారాల 2023 అవార్డుల కొరకు తెలుగు వెలుగు సాహితీ స్వచ్ఛంద సేవాసంస్థ వారు జ్యోతిష్ట అర్చక, పురోహిత రంగంలో తనను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 25న గుంటూరులోని చుట్టుగుంట పోలేరమ్మ దేవాలయంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో తనకు ఈ అవార్డుల పురస్కారం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

వాస్తు జ్యోతిష్య, అర్చక, పౌరోహిత్య రంగంలో గత కొంతకాలంనుండి విశేష సేవలందిస్తూ కృషిచేస్తున్నందున జాతీయ మహానంది పురస్కారానికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. తనను జాతీయ పురస్కారాలకు ఎంపికచేసినందుకు తెలుగు వెలుగు ఛైర్మన్ రాజ్‌కుమార్‌కు,రాష్ట్ర అధ్యక్షులు గౌరిశంకరాచార్యులకు దీపక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీపక్‌కు జాతీయ పురస్కారానికి ఎంపికైనందున కోటగిరి ఉమ్మడి మండల వాసులు హర్షం వ్యక్తంచేస్తూ ఆయనను అభినందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News