Thursday, December 19, 2024

ఈ నెల రెండో వారంలో హైదరాబాదులో జాతీయ ఓబిసి మహిళా సదస్సు

- Advertisement -
- Advertisement -

మహరాష్ట్ర ఎంపి సుప్రియ సులేకు బిసి నేతల ఆహ్వానం

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపచేసుకున్న మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోటా కల్పించాలని, దేశవ్యాప్తంగా బిహార్ రాష్ట్రం తరహలోనే బిసి కులగణన వెంటనే చేపట్టాలనే బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం ఈ నెల రెండో వారంలో హైదరాబాదులో పది వేల మంది బిసి మహిళా ప్రతినిదులతో  ‘బిసి మహిళల జంగు సైరన్’ పేరుతో జాతీయ ఓబిసి మహిళా సదస్సును నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరుతూ నేషనల్ నిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శరత్ పవార్ కుమార్తె, పార్లమెంట్ సభ్యురాలు సుప్రియ సులేని స్వయంగా కలిసి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు, మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ లో సుప్రియ సులెతో జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బిసి ప్రతినిధుల బృందం ఆమెతో సమావేశం అయ్యింది. ఓబిసి మహిళా సదస్సుకు హాజరుకావాలని ఈ సందర్బంగా ఆమెను ఆహ్వానించారు. ఓబిసి మహిళా సదస్సుకు తప్పకుండా వస్తానని సుప్రియ సులే హామీ ఇచ్చినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల రెండో వారంలో జరగనున్న మహిళా సదస్సుకు దేశవ్యాప్తంగా మహిళా పార్లమెంటు సభ్యులను, అఖిలపక్ష పార్టీలను, ఓబిసి మహిళా బిల్లుకు మద్దతు తెలిపిన జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అందులో బాగంగానే సుప్రియ సూలే ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా మహిళా బిల్లులో ఓబిసి మహిళలకు సబ్ కోటా సాధించే దిశగా ఒక రాజకీయ కార్యాచరణ ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి ఒక రాజకీయ కార్యచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. సుప్రియ సులేను కలిసిన వారిలో రాష్ట్రీయ ఓబిసి మహసంఘ్ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ భభన్ రావ్ తైవాడే, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకల శ్యాం కుర్మ, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బిసి జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్, జాజుల భాస్కర్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News