Sunday, December 22, 2024

రాజకీయ పార్టీల వసూళ్ల పర్వం

- Advertisement -
- Advertisement -

National parties collected Rs.15077 crores from unknown sources

గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.15,077 కోట్లు వసూలు చేసిన జాతీయపార్టీలు

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్)

న్యూఢిల్లీ: గుర్తుతెలియని వర్గాల నుంచి జాతీయపార్టీలు రూ.15,077.97 కోట్లు వసూలు చేశాయి. 2004-05 నుంచి 2020-21మధ్యకాలంలో ఈ వసూళ్లు జరిగాయని పోల్ రైట్స్ బాడీ విశ్లేషించింది. ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. 2020-21లో జాతీయ, ప్రాంతీయ రాజకీయపార్టీలు గుర్తుతెలియని సంస్థల నుంచి విరాళాల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ.690.67కోట్లుగా.. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఎనిమిది రాజకీయ పార్టీలు, ఇరవై ఏడు ప్రాంతీయపార్టీల వసూళ్లను ఎడిఆర్ పరిగణనలోకి తీసుకుంది.

జాతీయ రాజకీయ పార్టీల్లో కేంద్రంలోని అధికార భారతీయ జనతాపార్టీ(బిజెపి)తోపాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఎం), కమ్యూనిస్ట్ ఆఫ్ (సిపిఐ), నేషనలిస్ట్ కాంగ్రెస్ సమాజ్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. అదేవిధంగా ప్రాంతీయ పార్టీల్లో ఎఎపి, ఎజిపి, ఎఐఎడిఎంకె, ఎఐఎఫ్‌బి, ఎఐఎంఐఎం, ఎఐయుడిఎఫ్, బిజెడి, సిపిఐ (ఎల్), డిఎండికె, జిఎఫ్‌పి, జెడిఎస్, జెడియు, కెసిఎం, ఎంఎన్‌ఎస్, ఎన్‌డిపిపి, ఎన్‌పిఎఫ్, పిఎంకె, శివసేన, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఉన్నాయి. రాజకీయపార్టీలు దాఖలు చేసిన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎదుట దాఖలు చేసిన విరాళాల స్టేట్‌మెంట్ ఆధారంగా ఎడిఆర్ విశ్లేషించింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో 8రాజకీయ పార్టీలు రూ.426.74 కోట్ల ఆదాయాన్ని గుర్తుతెలియని వర్గాల నుంచి పొందినట్లు ప్రకటించాయి. మరోవైపు 27రాజకీయపార్టీలు రూ.263.928కోట్లు ఆదాయాన్ని పొందినట్లు తెలిపాయి. ప్రధానంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌పార్టీ పొందింది. జాతీయ రాజకీయపార్టీలు వసూలు చేసిన మొత్తం రూ.426.742కోట్లలో కాంగ్రెస్ పార్టీ విరాళాల మొత్తం 41.89శాతంగా ఎడిఆర్ పేర్కొంది. బిజెపి ప్రకటించిన రూ.100.542 మొత్తం 23.55శాతంగా తెలిపింది.

ప్రాంతీయపార్టీల్లో టాప్5లో ఉన్న పార్టీలను పరిశీలిస్తే ఎపికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంది. వైసిపి తర్వాత డిఎంకె కోట్లు, బిజెడి ఎంఎన్‌ఎస్ రూ.5.773కోట్లు, ఆప్ రూ.5.4కోట్లుతో తొలి ఐదుస్థానాల్లో నిలిచాయి. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొందిన ఆదాయంగా పేర్కొన్న మొత్తం రూ.690.67కోట్లలో టాప్5పార్టీల ఆదాయం 47.06శాతంగా ఉంది. కాగా కాంగ్రెస్‌పార్టీ, ఎన్‌సిపి సంయుక్తంగా నుంచి 2020-21మధ్య ఆదాయం ఎడిఆర్ పేర్కొంది. మరోవైపు ఏడు పార్టీలు ఎఐటిసి, సిపిఐ, కెసిఎం, ఎఐయుడిఎఫ్ సమర్పించిన ఆడిట్, విరాళాల వివరాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని ఎడిఆర్ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News