Tuesday, December 24, 2024

అర్జున్‌కు జాతీయ చెస్ టైటిల్

- Advertisement -
- Advertisement -

Master Arjun erigaisi in First position

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి ప్రతిష్టాత్మకమైన జాతీయ సీనియర్ చెస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అర్జున్ చివరి రౌండ్ వరకు అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించాడు. గ్రాండ్‌మాస్టర్ సేతురామన్‌తో గురువారం జరిగిన పదకొండో రౌండ్‌ను అర్జున్ డ్రాగా ముగించాడు. అయితే సమీప ప్రత్యర్థి డి.గుకేశ్ కూడా 8.5 పాయింట్లతో సమంగా నిలిచినా అర్జున్‌కే టైటిల్ దక్కింది. గుకేశ్‌తో సమానంగా నిలిచినా నిబంధనల ప్రకారం అర్జున్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టోర్నీలో అర్జున్ ఒక్క పోటీలో కూడా ఓటమి పాలు కాలేదు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక విజేతగా నిలిచిన అర్జున్ ఆరు లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News