హైదరాబాద్: అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 23 అంశాలను చేర్చామని, కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టోలు విడుదల చేశారు. మేనిఫెస్టో తెలుగు ప్రతిని టిపిసిసి వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని, యువత కోసం వివిధ రకాల యూనివర్సిటీలు తీసుకొస్తామని, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని, ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు గ్రామాలను మళ్లీ తెలంగాణలో విలీనం చేస్తామని, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను పెంచుతామని బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రతి గడపకు మేనిఫెస్టోను తీసుకెళ్లాలన్నారు.
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తాం: శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -