Thursday, January 23, 2025

ఆర్యన్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇక్కడి జిఎంసి బాలయోగి స్టేడియం స్విమ్మింగ్ అకాడమీలో జరుగుతున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఆర్య నెహ్రా (గుజరాత్) పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన పోరులో ఆర్యన్ 15.29.26 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక పురుషుల 200 మీటర్ల బట్టర్‌ప్లయ్ విభాగంలో సాజన్ ప్రకాశ్ (ఎఐసిఎస్‌సిబి) స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

సాను దేబ్‌నాథ్ (ఆర్‌ఎస్‌పిబి)కి రజతం, హర్ష్ సరోహా (హర్యానా)కు కాంస్యం లభించాయి. ఇక మహిళల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో భావ్య సచ్‌దేవా (ఢిల్లీ) స్వర్ణం సొంతం చేసుకుంది. వ్రితీ అగర్వాల్ (తెలంగాణ)కు రజతం, అనన్య (మహారాష్ట్ర)కు కాంస్య పతకాలు దక్కాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ కార్యదర్శి మొనాల్ చౌక్సి, తెలంగాణ కార్యదర్శి ఉమేశ్ తదితరులు విజేతలకు పతకాలను బహూకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News