Tuesday, September 17, 2024

82 మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

- Advertisement -
- Advertisement -

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 82 మందికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో అవార్డులు ప్రదానం చేశారు. విద్యా బోధనలో నాణ్యత పెంచడమే కాక, విద్యార్థుల జీవితాలను మెరుగుపర్చేందుకు వీరు చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా ఈ అవార్డులు లభించాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపొందించడం, ఇంటిదగ్గరే వారి చదువులు పర్యవేక్షించడం, బాల్యవివాహాలను నిరోధించడం, వ్యర్థాలతో తిరిగి ఉపయోగపడే వస్తువులు చేయడం, అద్భుతమైనఆటోమేటిక్ స్కూల్ బెల్ తయారీ తదితర ప్రత్యేకతలు చూపించిన ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. పాఠశాల విద్య, అక్షరాస్యత, విద్యామంత్రిత్వశాఖ ఈ ఏడాది (2024) జాతీయ అవార్డుల కోసం 28 రాష్ట్రాలు,

కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆరు సంస్థల నుంచి 50 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఈ 50 మందిలో 34 మంది పురుషులు కాగా, 16 మంది మహిళలు, ఇద్దరు దివ్యాంగులు, మరొకరు సిడబ్లుఎస్‌ఎన్ లో పనిచేస్తున్నారు. దీంతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్‌కు చెందిన 16 మంది, మినిస్ట్రీ ఆఫ్‌స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి మరో 16 మందిని అవార్డుల కోసం ఎంపిక చేసినట్టు విద్యామంత్రిత్వశాఖ సీనియర్ అధికారి తెలిపారు. గత ఏడాది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌ల నుంచి, పాలిటెక్నిక్స్ నుంచి ఈ విధంగా రెండు కేటగిరీల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అంతకు ముందు ఈ అవార్డులు స్కూల్ టీచర్లకే పరిమితం అయ్యేవి .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News