Wednesday, January 22, 2025

జోరుగా హుషారుగా షికారు చేయండి!

- Advertisement -
- Advertisement -
National Tourism day 2022
బస్సు ఆగిన చోట ఎక్కండి…. కదిలే బస్సు ఎక్కకూడదు…
ప్రయాణికులకు ఆర్టీసి ఎండి సజ్జనార్ ట్వీట్

హైదరాబాద్: ఎన్నో ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలకు రాష్ట్రం నెలవు. మిమ్మల్ని తీసుకెళ్లేందుకు మా బస్సు సిద్ధంగా ఉంది. మరి మీరు? మీ ప్రతి పర్యటననూ టిఎస్ ఆర్టీసితో సురక్షితం చేసుకోండి. జోరుగా హుషారుగా షికారు చేయండి! అంటూ ఆర్టీసి ఎండి సజ్జనార్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

సాయిపల్లవి చేసిన ఎంసిఏ సినిమా సన్నివేశం పోస్ట్

ముఖ్యంగా ఆర్టీసిని క్రమశిక్షణలో పెట్టేందుకు సజ్జనార్ ఎప్పటికప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటూ అధికారులను అలర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల చేసే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసికి నష్టం చేసేలా ఏ చిన్న అంశమైన ఆయన సీరియస్ అవుతున్నారు. సినిమా, సెలబ్రిటీస్, ప్రసార మాధ్యమాలు ఇలా ఏదైనా కఠినంగా వ్యవహారిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి చేసిన ఎంసిఏ సినిమా సన్నివేశాన్ని ఎండి పోస్ట్ చేశారు. అందులో సాయిపల్లవి రన్నింగ్‌లో ఉన్న బస్సును ఎక్కుతుంది. దీనిపై సజ్జనార్ స్పందిస్తూ బస్సు ఆగిన చోట ఎక్కండి…. కదిలే బస్సు ఎక్కకూడదంటూ ప్రయాణికులకు సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News