Monday, January 27, 2025

18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీ
పాల్గొన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్
మన తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా పోస్టాఫీస్ సెంటర్‌లో మానవహారం ఏర్పర్చి జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి తెలిపారు. కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ… మన జిల్లాలో ఉన్న పౌరులందరూ నిష్పక్షపాతంగా ప్రశాంతంగా ఎన్నికలలో ఓటు వేయాలని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతీ ఎన్నికల్లో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేశారు. బెస్టు ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డును కొత్తగూడెం తహీసల్దార్ పుల్లయ్యకు, డీఎల్‌ఎంటీ సాయి కృష్ణకు అందించారు. కొత్తగూడెంకి నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులను అందజేశారు. ట్రాన్స్ జెండర్ ఓటర్లకు సన్మానం చేశారు. సీనియర్ సిటిజన్‌ని కూడా సన్మానించారు. దివ్యాంగ ఓటర్లను కూడా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్స్ నూతన ఓటర్లు సుమారు 2 వేల మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ విద్యాచందన, జిల్లా పరిషత్ సీఈవో నాగలక్ష్మీ, ఆర్డీవో మధు, డీఎస్పీ రెహమాన్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ స్వామి, ఎలక్షన్ సెల్ తహసీల్దార్ దారా ప్రసాద్, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ ప్రసాద్, సుజాతనగర్ తహసీల్దార్ శిరీష, చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ, పాల్వంచ తహసీల్దార్ వివేక్, రంగా ప్రసాద్, అంజద్ పాషా, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News