మనతెలంగాణ/హైదరాబాద్: నదులు అనుసంధానంపై మొదట సమగ్ర అధ్యయనం ద్వారా నీటి లభ్యత తేల్చాకే ఈ అంశంలో ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. మంగళవారం జాతీయ జల అభివృద్ధి సంస్థ గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై సమావేశం నిర్వహించింది. బెంగూళూరులో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపి, తోపాటు మొత్తం 11రాష్ట్రాల నీటి పారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే ఇందులో కొన్ని రాష్ట్రాల అధికారుల వర్చువల్‌గా సమావే శానికి హాజరయ్యారు. సమావేశంలో జాతీయ జల అభివృద్ది సంస్థ అధికారులు నదుల అనుసంధానం అవశ్యకత ను వివరించారు. గోదావరికావేరి నదలు అనుసంధానాకిని సంబంధించిన ప్రతిపాదనలను సమావేశంలో వివరించారు. గోదావరి నదిలో నీటిలభ్యత తొలుత అంచనావేసినట్టుగా 247 టిఎం సీలు లేవన్న ప్రాధిమిక అంచ నా మేరకు ప్రతిపా దనలను మార్పు చేసినట్టు తెలిపారు. గోదావరిలో 141టిఎంసీలకు మించి నీటిలభ్యతకు అవకాశం లేదన్న అభిప్రాయంతో నదుల అనుసంధానం లక్ష్యాలను కూడా సవరించినట్టు తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు మాట్లాడుతూ గోదావరినదిలో నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం జరిపించాలని కోరారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం సూచించిన విధంగా నదుల అనుసంధానం ప్రతిపాదనలో మార్పులు చేయాలని కోరారు. అ తరువాతే తెలంగాణ రాష్ట్రం నదుల అనుసంధానంపై ఒక నిర్ణయానికి వచ్చి తమ అభిప్రాయం తెలిపే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. గోదావరి నదీజాలాల్లో తెలంగాణ రా్రష్ట్ర హక్కుల కు ఏమాత్రం భంగం వాటిల్లినా నదుల అను సంధాన ప్రతిపాదనకు అంగీకరించే ప్రశ్నేలేదని తెగేసి చెప్పారు. ఎపి ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర అధికారుల సూచ నలతో ఏకభివించింది. మొదట గోదావరినదిలో మిగులు నీరు ఎంత అన్నది నిగ్గు తేల్చాలని కోరింది. సమావేశంలో వివిధ రాష్ట్రాలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించాయి.
National Water development firm meeting on Godavari-Kaveri Link