Wednesday, January 22, 2025

29న జాతీయ వోవినం మార్షల్ ఆర్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: కింగ్‌కోఠిలోని షాలీమార్ పంక్షన్ హాల్‌లో ఈనెల 29 నుంచి జూలై 2 వరకు 12వ జాతీయ వోవినం మార్షల్ ఆర్ట్ చాంఫియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తున్నామని వోవినం అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.విష్ణు సహాయ్ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డా.విష్ణుసహాయ్ మాట్లాడుతూ ఈపోటీల ద్వారా వియత్నాంలో 2023, నవంబర్ 21 నుండి డిశంబర్ 1 వరకు జరిగే 7వ ప్రపంచ వోవినం ఛాంపియన్‌షిఫ్‌లో పాల్గొనేందుకు భారత వోవినం జట్టును ఎంపిక చేయబోతున్నామని వెల్లడించారు.

షాలీమార్‌లో దాదాపు 600మంది క్రీడాకారులు,70 మంది అధికారులు 24 రాష్ట్రాల నుంచి పాల్గొనబోతున్నారని చెప్పారు. ఈ పోటీల్లో మినీ సబ్ జూనియర్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలను స్త్రీ , పురుష విభాగాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. జూన్ 29 సాయంత్రం 4 గంటలకు ప్రారంభించి జూలై 2 సాయంత్రం 5 గంటలకు ముగించనున్నామని పేర్కొన్నారు. ఈపోటీల ప్రారంభానికి క్రీడల మినిస్టర్ శ్రీనివాస్‌గౌడ్, ఎంఎల్‌సి కవిత, ముగింపు వేడుకలకు ఏపి ఒలంపిక్ కమిటీ ఉపాధ్యక్షులు వి.శెట్టి పాల్గొననున్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సెక్రెటరీ శంకర్‌మహాబలి, సభ్యులు ఉజ్వల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News