Sunday, December 22, 2024

బిఆర్ఎస్ తోనే దేశ పురోగతి : మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలన,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు సింగరి హేమంత్ వారి అనుచరులు శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ఆనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ ప్రగతి దేశానికి నేడు రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ లాగే తమకు అభివృద్ది కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని,బిఆర్ఎస్ తోనే దేశ పురోగతి సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రెంజర్ల సర్పంచ్ ఆకుల రాజారెడ్డి,ముప్కాల్ మండల ఎంపీపీ సామ పద్మా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News