Monday, December 23, 2024

మండల్ సిఫార్సుల అమలుకు దేశవ్యాప్త ఆందోళనలు

- Advertisement -
- Advertisement -
ఆగస్టు 7న జాతీయ ఓబిసి మహాసభకు కదిలి రండి : జాజుల

హైదరాబాద్ : మండల్ సిఫార్సుల అమలుకు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగా ఆగస్టు 7న అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎస్వీ యూనిర్సిటీ మహతి ఆడీటోరియంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహా సభలకు బిసిలు పెద్దెఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల్ డే సందర్భంగా నిర్వహిస్తున్న చలో తిరుపతి పోస్టర్‌ను జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర బిసి సంఘాల నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని 29 రాష్ట్రాల నుండీ వేలాది మంది బిసిలు రాజకీయాలకు అతీతంగా పాల్గొంటారన్నారు. 26 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ముఖ్య అథిదులుగా హజరుకానున్నట్టు ఆయన తెలిపారు. ఈ మహసభ దేశంలో చారిత్రాత్మకం కాబోతుందన్నారు బిసీల బతుకులను మార్చడానికి బిహార్ మాజీ సీఎం బిందేశ్వర్ ప్రసాద్ మండల్ దేశ వ్యాప్తంగ పర్యటించి 42 సిఫార్సులు చేశారని, మొదటి సిఫార్సును ఆమలు చేస్తున్నట్లు ప్రకటించిన రోజు అయిన అగస్టు ఏడును మండల్ డే గా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ మండల్ డే సందర్బంగ ఈసారి ఎనిమిదివ మహసభ ను తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 60 శాతం ఉన్న బిసి కులాలను ఎందుకు చిన్న చూపు చూపిస్తున్నారని ప్రశ్నించారు.
విభజించి పాలించే పార్టీలకు తగిన విధంగా బుద్ది చెప్తామని హెచ్చరించారు. దామాషా ప్రకారం ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 34 సీట్లు బిసీలు ఆమోదించరని జాజుల పేర్కొన్నారు. బిసి వ్యతిరేక పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఒక వేళ తమ ఓట్లు కావాలంటే తమ డిమండ్స్ నెరవేర్చాలన్నారు. తిరుపతి లో జరిగే సభలో దాదాపు 26 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని, తెలుగు రాష్ట్రాల బీసిలు పాల్గొని విజవంతంగా
చేయాలని కొరారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవి కృష్ణ, విద్యార్థి సంఘ కేంద్ర అధ్యక్షులు విక్రమ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్క చర్ల శ్రీనివాస్, మహేశ్ యాదవ్, సింగం నగేశ్, జాజుల లింగయ్య, చంద్ర శేఖర్, స్వర్ణ,శ్యామల, సంపత్, సుజాత, మహేశ్ గౌడ్, హేమలత,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News