Tuesday, January 28, 2025

దేశవ్యాప్తంగా కులగణన

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ సూచనకు సిడబ్లూసి సై ఆ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన కాంగ్రెస్
అత్యున్నత నిర్ణయక కమిటీ నియోజకవర్గాల పునర్విభజనపై వ్యూహాత్మకంగా
వ్యవహరించాలని రేవంత్ ప్రతిపాదన జనాభా ప్రతిపాదికన విభజన జరిగితే దక్షిణాది
రాష్ట్రాలకు నష్టమని హెచ్చరిక ఈ విషయంలో ఎఐసిసి ఆచితూచి వ్యవహరించాలని హితవు
కులగణనతో దేశంలో విప్లవాత్మక మార్పులు: పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్

దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రా ల్లో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుందని అందువల్ల ఏఐసిసి వ్యూహాత్మకంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి సూచించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశంలోనే మార్గదర్శిగా ఉందని, కేంద్ర ప్ర భుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణనలో దేశవ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలని సిఎం రేవంత్ అన్నారు. ఈ విషయంలో సిడబ్ల్యుసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించగా రేవంత్ రెడ్డి ప్రతిపాదనను సిడబ్ల్యూసి తీర్మా నం చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది.

కర్ణాటకలోని బెల్గాంలో గురువారం ప్రారంభమైన సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న సిఎం రేవంత్ మాట్లాడుతూ నియోజక వర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుం డా జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. చట్ట సభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి ఒక కొలిక్కి తెచ్చిన నేపథ్యంలో ఆ బిల్లు పై మనం ఎక్కవగా ప్రచారం చేయాలని సిఎం అన్నారు. బిజెపి మహిళా బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహారించాలని సిఎం రేవంత్ తెలిపారు.

బిజెపి కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు: పిసిసి అధ్యక్షుడు
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సరిగ్గా వంద ఏళ్ల క్రితం ఇదే బెల్గాంలో మహాత్మా గాంధీని సిడబ్ల్యూసి ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నుకుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీని ఆచరిస్తున్నారని అందుకు ఆయన చెప్పిన సిద్ధాంతాలు, విధానాలే కారణమని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో చేపట్టాలని నిర్ణయించిన కులగణనతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఇది దేశం అంత స్వాగతించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్న బిజెపి కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభించిందని, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. తెలంగాణ కులగణన అత్యంత పకడ్భందీగా అన్ని వర్గాల ఆలోచనలను స్వీకరించి ఒక అద్భుతమైన ప్రశ్నావళి రూపొందించి సర్వే చేయించడం జరిగిందని, ఇప్పటికే 90 శాతం కులగణన పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. బిజెపి రాజ్యాంగాన్ని, చరిత్ర ను తిరగరాయాలని చూస్తుందని ఇలాంటి తరుణంలో దేశానికి సేవలు, త్యాగాలు చేసిన కాంగ్రెస్ చరిత్ర కారుల, త్యాగ పురుషుల జీవితాలను నేటి తరానికి వివరించాలని పిసిసి అధ్యక్షుడు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News