Wednesday, January 22, 2025

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి: దిగ్విజయ్ సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సమావేశంలో దిగ్విజయ్ ప్రసంగించారు. రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయిందని, నిరసన తెలిపేందుకు రైతులు ఢిల్లీకి రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నారని, అదానీ లాంటి వాళ్లకు మేలు జరిగే నిర్ణయాలే ఎక్కువగా తీసుకున్నారని దుయ్యబట్టారు. దేశంలో పెరుగుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని, తన యాత్రలో రాహుల్ గాంధీ ప్రధానంగా ఐదు సమస్యలు పరిశీలించారని, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News