Monday, December 23, 2024

దేశం మొత్తం మీద కులగణన, ఆర్థిక సర్వేలు : రాహుల్ హామీ

- Advertisement -
- Advertisement -

ముంబై : కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే దేశం మొత్తం మీద, ముఖ్యంగా గిరిజన ఆధిపత్య నందర్బార్ వంటి ప్రాంతాల్లో కులగణన , ఆర్థిక సర్వేలు చేపడుతుందని, ఇది గొప్ప విప్లవాత్మక ముందడుగుగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలాగే గిరిజనులకు సంబంధించి అటవీ హక్కుల చట్టాన్ని బలోపేతం చేయడమౌతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీలు గుప్పించారు. గుజరాత్ నుంచి మహారాష్ట్ర లోని గిరిజన ఆధిపత్య నందర్బార్ జిల్లా లోకి భారత్ జోడో న్యాయయాత్ర ప్రవేశించిన సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు.

దేశ జనాభాలో గిరిజనులు 8 శాతం వరకు ఉన్నారని, అభివృద్ధిలో సరైన వాటా వారికి దక్కేలా కాంగ్రెస్ పాటుపడుతుందని రాహుల్ హామీ ఇచ్చారు. వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతుధర కల్పిస్తామన్నారు. బీజేపీ అటవీ హక్కులు, భూసేకరణ హక్కులు వంటి చట్టాలను బలహీనం చేసిందని విమర్శించారు. ఆ చట్టాలను బలోపేతం చేయడమే కాక, ఏడాదిలో గిరిజనుల వివాదాలు, సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. అటవీ హక్కుల చట్టానికి సంబంధించి వేలాది గిరిజనుల హక్కులను బీజేపీ తిరస్కరించిందని, అడవులతో గిరిజనులకున్న సంబంధాలను తిరస్కరించిందని బీజేపీపై ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News