Monday, December 23, 2024

సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్త డిమాండ్

- Advertisement -
- Advertisement -

16 రాష్ట్రాల పరిశ్రమలకు బొగ్గు సరఫరా
స్పాట్ ఈ ఆక్షన్ ద్వారా రూ. 403 కోట్లు ఆదాయం
9 సంవత్సరాల్లో 667 లక్షల టన్నుల బొగ్గు రవాణతో రూ. 28,459 కోట్లు ఆదాయం

మన తెలంగాణ / హైదరాబాద్:  సింగరేణి కాలరీస్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. అధికారులు ఆదేశాల మేరకు మార్కెటింగ్ విభాగం మార్కెట్లో వస్తున్న పరిణామాలను గమనిస్తూ దానికి అనుకూలంగా బొగ్గును లాభదాయకంగా అమ్ముకోవడం కోసం అనేక చర్యలు తీసుకొని విజయవంతంగా సాగుతున్నాయి. గత 9 సంవత్సరాల కాలంలో వినియోగదారుల పరిధి గణనీయంగా పెరిగింది. ఇప్పటికే సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి 16 రాష్ట్రాలలో(తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహరాష్ట్ర,తమిళనాడు ,ఒడిస్సా,చత్తీస్‌ఘడ్,మధ్యప్రదేశ్, హర్యాన,ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్,, గుజరాత్, వెస్ట్‌బెంగాల్, గోవా )గల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకొని బొగ్గును అందజేస్తోంది.

2022 -23 సంవత్సరంలో మరో 160 కొత్త విద్యుత్, విద్యుతేతర వినియోగదారులు సింగరేణి మార్కెట్లోకి వచ్చి చేరారు. కొత్తగా మరో 8 ప్రభుత్వ విద్యుత్ సంస్థలు బొగ్గు సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒడిశా రాష్ట్రంలో సింగరేణి సంస్థ చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఉత్పత్తి కానున్న బొగ్గును దామోదర్ వ్యాలీ కంపెనీకి అమ్మడానికి కూడా ఒప్పందం కుదిరింది. కరోనా సమయంలో బొగ్గుకు డిమాండ్ తగ్గిన కాలంలో సింగరేణి సంస్థ వ్యూహాత్మకంగా బొగ్గు ధరను తగ్గించి, తన మార్కెట్ యథాతథంగా నిలుపుకొని చివరిగా దాదాపు 1500 రూపాయల లాభాన్ని సాధించింది.

2022-23 సంవత్సరంలో సింగరేణి మార్కెటింగ్ విభాగం అత్యధికంగా 667 లక్షల టన్నుల బొగ్గును స్థాయిలో 28,459 కోట్ల రూపాయల అమ్మకాలు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో సింగరేణి నుండి బొన్ని కొంటున్న ప్రతీ థర్మల్ విద్యుత్ కేంద్రానికి కూడా బొగ్గు సరఫరాలో అంతరాయం లేకుండా సింగరేణి సంస్థ కృషి చేసింది. 2022 -23లో తన వ్యాపార వ్యూహంలో భాగంగా స్పాట్ ఈ -ఆక్షన్ కోసం రెండు మిలియన్ టన్నుల బొగ్గును అమ్మకానికి పెట్టి, తద్వారా దాదాపు 403 కోట్ల రూపాయలను అదనంగా ఆర్జించింది. టన్నుకు సుమారు 2,000 రూపాయలను నోటిఫైడ్ ప్రైస్ కన్నా అదనంగా సాధించగలిగింది. నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్ వారికి నిర్వహించే కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ వేదికగా జరిపిన బొగ్గు వేలంలో మంచి లాభాలు గడిస్తోంది. 2022- 23లో 8వ విడత బొగ్గు వేలంపాటలో 2.58 మిలియన్ టన్నుల బొగ్గును అమ్మడం ఇప్పటివరకు ఒక ఆల్టైం రికార్డ్. సంస్థ ఛైర్మన్ దేశం మరియు దిశా నిర్దేశంలో మార్కెట్లో. న్న మార్పులని గమనిస్తూ పోటీ మార్కెట్ను కోవడం కోసం ఇప్పటి నుండే పట్టిష్టమైన పునాధులను ఏర్పరుచుకుంటోంది.
గట్టి పునాదులను ఏర్పర్చుకొంటోంది.

2022-23 ఆర్దిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 549.69 లక్షల టన్నులు బొగ్గును విద్యుత్ సంస్థలకు సరఫరా చేయగా, సిమెంట్ సంస్థలకు 52.08 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. సిమెంట్ సంస్థలు, స్పాంజ్ ఐరన్, మందులు, ఎరువులు, పేపరు ,సిరామిక్స్, వంటి విద్యుతేతర సంస్థలకు 117.25 లక్షల టన్నులను సరఫరా చేసినట్లు సంస్థ తన నివేదికలో పేర్కొంది.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News