హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. డిహెచ్, డిజిపి, కార్మిక, జైళ్ల శాఖలు, జిహెచ్‌ఎంసి వేర్వేరు నివేదికలు సమర్పించాయి. ఈ సందర్భంగా డిహెచ్ మీడియాతో మాట్లాడారు. మే 29న లక్ష కరోనా పరీక్షలు జరిగాయని, రెండో దశ ఫీవర్ సర్వేలో 68.56 మందికి పరీక్షలు చేశామని, ప్రైవేటు ఆస్పత్రులపై పిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఎఎస్‌లతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేశామని, ఇప్పటి వరకు పది ఆస్పత్రుల కరోనా చికిత్స లైసెన్స్ రద్దు చేశామని, బ్లాక్ ఫంగస్ మందులకు దేశ వ్యాప్తంగా కొరత ఉందని, బ్లాక్ ఫంగస్ ఔషధాలు కొనుగోలు చేస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1500 పడకలు అందుబాటులో ఉన్నాయని డిహెచ్ వివరించాడు. కరోనా చికిత్సలకు తగినన్ని ఆస్పత్రులు, పడకలు ఉన్నాయని, మూడో దశ ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మూడో దశకు అవసరమైన మందులు ముందుగానే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశాడు. ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని, నిలోఫర్ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు.
ఆ మందులకు దేశ వ్యాప్తంగా కొరత: డిహెచ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -