కీవ్: తాము నాటో కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ నేత వోలోడ్మిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎట్టిపరిస్థితుల్లోనూ నాటో చేరకూడదనే రష్యా హెచ్చరికలకు అనుగుణంగానే జెలెన్‌స్కీ స్పందించడం కీలకం అయింది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం గురించి తాము ఎప్పుడు పాకులాడలేదని ఆయన తెలిపారు. తాము పశ్చిమ ప్రాబల్య దేశాల అనుకూల పక్షంగా మారుతున్నామనే రష్యా ఆరోపణలను ఈ సందర్భంగా ఉక్రెయిన్ నేత తోసిపుచ్చారు. అయితే నాటో కూటమిలో తాము చేరడం లేదనడం, ఇదే దశలో రెండు రష్యా ప్రాంతాలపై రాజీకి తాము సానుకూలమనే ఆయన ప్రకటన దౌత్యవర్గాలలో చర్చకు దారితీశాయి. క్రమంగా ఉక్రెయిన్ నేత రష్యా పట్ల తన వైఖరిని మార్చుకుంటున్నారనే సంకేతాలకు దారితీసింది. రష్యా నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల హోదా విషయంపై తాము రష్యాతో చర్చకు సిద్ధమని ఉక్రెయిన్ నేత తెలిపారు. తాము నాటోలో చేరడం లేదని, ఇదే విధంగా ఉక్రెయిన్‌ను తీసుకోవడానికి నాటో కూడా సిద్ధంగా లేదని తాము భావిస్తున్నామని ఓ ఇంటర్వూలో వెల్లడించారు. రష్యాతో తగవులు, లేదా వివాదాస్పద విషయాలపై నాటో ఎప్పుడూ తటస్థంగానే ఉంటుంది. వీటిపై మాట్లాడటానికి భయపడుతుందని అన్నారు.
నాటోలో చేరేది లేదు: వెల్లడించిన ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -