Monday, December 23, 2024

నాటో- రష్యా మధ్య పోరు అంటే మూడో ప్రపంచ యుద్ధమే

- Advertisement -
- Advertisement -

NATO-Russia Clash Could Trigger World War 3:Biden

ఉక్రెయిన్‌లో అమెరికా నేరుగా జోక్యం చేసుకోదు: బైడెన్ స్పష్టీకరణ

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఆపేందుకు అమెరికా నేరుగా జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. నాటో దేశాలకు, రష్యాకు మధ్య అలాంటి ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఆయన అన్నారు.‘ ఉక్రెయిన్‌లో రష్యాకు వ్యతిరేకంగా మేము యుద్ధం చేయబోము’ అని శుక్రవారం వైట్‌హౌస్‌లో చేసిన ప్రసంగంలో బైడెన్ స్పష్టం చేశారు. రష్యా దాడులను ఆపేందుకు నాటో నేరుగా జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ విషయం స్పష్టం చేశారు. కాగా ఉక్రెయిన్‌పై దాడులను ఆపకపోతే రష్యాకు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేస్తామని బైడెన్ హెచ్చరించారు. పుతిన్ ఓ దురాక్రమణదారని, అందుకు ఆయన మూల్యం చెల్లించి తీరాల్సిందేనని కూడా బైడెన్ స్పష్టం చేశారు. అలాగే ఉక్రెయిన్‌లో రష్యా గనుక రసాయన ఆయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా హెచ్చరించారు. మరో వైపు ఉక్రెయిన్‌పై సైనిక దాడులను కొనసాగిస్తున్న రష్యాకు, దాడులకు మద్దతు ఇస్తున్న బెలారస్‌కు లగ్జరీ వస్తువుల ఎగుమతులపై అమెరికా నిషేధం విధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News