Monday, December 23, 2024

ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాడనున్న రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఆస్కార వేడుకల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు మరో అరుదైన గౌరవ దక్కనున్నది. రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను ఆస్కార్ అవార్డుల ప్రదానతోత్సవ వేడుకలో యువగాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడనున్నారు.

ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్సెస్ మంగళవారం రాత్రి తన అధికారి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. 96వ ఆస్కార్స్‌లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడే నాటా నాటు పాటను ప్రత్యక్షంగా వీక్షించండి..మార్చి 12వ తేదీ(ఆదివారం) ఎబిసి చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి అంటూ అకాడమీ పేర్కొంది. లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగే ఆస్కార్స్ వేదికపై నాటు నాటు పాడనున్న రాహుల్ సిప్లిగంజ్ అకాడమీ ప్రకటనను తన అఢికారిక ట్విటర్ పేజ్‌లో షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News