హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వరించింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. దీంతో నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. హాలీవుడ్ సినిమాలను తలదన్ని మన టాలీవుడ్ సినిమాకు ఆస్కార్ అవార్డు గర్వంగా ఉందని రాజకీయ, సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. చంద్రబోస్ పాటను రచించగా కీరవాణి సంగీతం అందించాడు. రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవ నాటు నాటు పాటకు స్వరాలు అందించారు.
నాటు నాటు సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని ప్రెసిడెంట్ భవనంలో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనస్కీ కూడా గతంలో టివి యాక్టర్, హాస్యనటుడు కావడంతో నాటు నాటు సాంగ్ షూటింగ్ కోసం అనుమతి ఇచ్చారు. ఆ భవనం ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక నివాసం అయినప్పటికి షూటింగ్ కోసం అనుమతి ఇవ్వడం, ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికి ఆ భవనానికి ఎలాంటి హాని జరగలేదు. ఇప్పటికి ఆ భవనంలో అలాగనే ఉంది. అందులో నుంచి జెలనస్కీ పాలన వ్యవహరాలను నడిపిస్తున్నారు. ఆ రాజభవనం పేరు మారినస్కీ. ఈ భవనాన్ని 1752లో రష్యా అధినేత ఎలిజబెత్ పాట్రోవ్నా నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి ఆర్కిటెక్చర్ బర్టోలోమోయి పని చేశాడు. గతంలో నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది.