Sunday, January 19, 2025

గాలివాన బీభత్సం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భైంసా/వెల్దుర్తి/మోత్కూరు : నిర్మల్, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు మండలాల్లో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నిర్మల్ జిల్లా, భైం సా పట్టణంతో పాటు భైంసా మండలం ముథోల్, కుంటాలతో పాటు పలు ప్రాంతాల్లో ఆ కాశంలో నల్లటి మబ్బులు ఏర్పడి సాయంత్రం 5 గంటల సమయంలోనే చీకటైంది. ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలు చెందారు. పలు ప్రాం తా ల్లో వడగండ్ల వర్షం కురిసింది. రైతుల చేతికొచ్చిన మొక్కజొన్నతో పాటు జొన్న, ధాన్యం సైతం పలు ప్రాంతాల్లో వర్షానికి తడిసింది. ఈదురుగాలులతో పంటలకు నష్టం జరిగిం ది. పట్టణంలో రాత్రి 8 గంటల వరకు సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతులు కల్లాలలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది.

అప్పటివరకు ఎండ కొడుతూ ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఈదురుగాలుతో కురిసిన వర్షానికి రైతన్న కష్టపడి పండించిన పంటనీట మునిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో , మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో మోత్కూర్ వ్యవసాయ మార్కెట్‌లో, గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. మండలంలోని దత్తప్పగూడెం, దాచారం, ముషిపట్ల, బుజిలాపురం, కొండాపురం, జామ చెట్ల బావిలోని మామిడి తోటల్లో అకాల వర్షానికి చేతికొచ్చిన మామిడికాయలు నేలపాలు కావడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News