Wednesday, January 22, 2025

ప్రకృతి పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: ప్రకృతి పరిరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని ఆల్వీన్ కాలనీలో హరిహారం కార్యాక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌తో కలసి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ బహుష్యత్తు తరాలకు అవసరమైయ్యే విధంగా ప్రతిఒక్కరూ చెట్లు నాటే బాధ్యత చేపట్టాలన్నారు. కాలనీల్లో చెట్లు నాటడంతో మంచి వాతవరణంతోపాటు కాలుష్య భారీ నుంచి కాపాడుకోగలుగుతామన్నారు. సిఎం కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల బాగుపడుతుందన్నారు. ప్రతిఒక్కరూ వారి వారి ఇంటి ముందు చెట్లు నాటు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపిడిఓ బన్సిలాల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News