Tuesday, April 8, 2025

630 కేజీల నల్లబెల్లం, నాటుసారా పట్టివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హుజూర్‌నగర్‌: 630 కేజీల నల్లబెల్లం, 20 కేజీల పటిక, 35 లీటర్ల నాటుసారాయి పట్టుకున్నట్లు హుజూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున్‌రెడ్డి తెలిపారు. బుధవారం హుజూర్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయం నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. హుజూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు మంగళవారం, బుధవారం నియోజకవర్గం పరిధిలోని గరిడేపల్లి, పాలకవీడు, మఠంపల్లి మండలాలల్లో దాడులు నిర్వహించగా, కీతవారిగూడెంలో ఒక వ్యక్తి నుంచి 40 కేజీల బెల్లం, ఐదు లీటర్ల సారాను స్వాదీనం చేసుకున్నారు.

ఆతర్వాత కపూయా తండాకు చెందిన మరొక వ్యక్తి నుంచి 40 కేజీల బెల్లం, 10 లీటర్ల సారాను, గరిడేపల్లికి చెందిన ఒకవ్యక్తి ఇంట్లో ఐదు లీటర్ల సారాను, బిల్యానాయక్ తండాకు చెందిన ఒకవ్యక్తి ఇంట్లో 11బస్తాలు(550)కేజీల నల్లబెల్లం, 10 లీటర్ల సారాను, గడ్డిపల్లి శివారులో ఒక వ్యక్తి ఐదు లీటర్ల సారాను తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, బెల్లం, సారాను స్వాదినపర్చుకొని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని వివరించారు. ఈ దాడులల్లో ఎక్సైజ్ ఎస్‌ఐలు సతీస్‌కుమార్ రెడ్డి, వెంకన్న, సిబ్బంది నాగరాజు, రవి, నాగయ్య, నాగమణి, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News